తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.ఏటా వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతికి రావడం తనకు ఆనవాయితీ అని, ఆ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు. శ్రీవారి ఆశీర్వాదం, అనుగ్రహం సీఎం కేసీఆర్కు ఉన్నాయని, ఆ అనుగ్రహంతో మరెన్నో ప్రజోపయోగ పనులు చేస్తారని వెల్లడించారు.