బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం విజయ రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమపంగు లక్ష్మయ్య, కొత్తపల్లి మన్సూర్, మాజీ వార్డ్ మెంబర్ కొత్తపల్లి ఎల్లమ్మ, బీఎస్పీ గ్రామ కన్వీనర్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తదితర 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.
ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు . టిఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శ్రీరామరక్షగా ఉన్నాయన్నారు.
పార్టీలో చేరిన వారు సోమపంగు నరేష్, కుసుమ కుమారి, హరికృష్ణ, సాయికుమార్, చెరుకుపల్లి అశోక్, కత్తి శీను, రాజీవ్, కళ్యాణం సైదులు, కాశయ్య, రవి, సాంబ, శివ కృష్ణ, లింగయ్య, విరితోపాటు 20 కుటుంబాలు టిఆర్ఎస్ లో చేరారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సరానికి పురస్కరించుకొని ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపి,ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్ , మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోగరు రమేష్, మండల ఉపాధ్యక్షులు సోమపంగు సైదులు, ఉప సర్పంచ్ లింగారావు, వార్డ్ మెంబర్ అనూష, గ్రామ శాఖ అధ్యక్షులు కోటయ్య, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.