Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు ఎంతగానో సహకరిస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వానికి చాలా వరకు పనిని తగ్గించి ప్రజలకు దగ్గరగా పనులు చేస్తూ వస్తున్నారు అలాగే ఏ సాయం కావాలన్నా ప్రజలు ముందుగా సంప్రదించేది వాలంటీర్లనే అలాంటివారు కొన్నిసార్లు నిందితులుగా మారుతున్నారు..
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో యర్రగొండ పాలెంలో ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగు చూశాయి. అయితే ప్రతినెలా తీసుకువచ్చినట్టే సచివాలయ సంక్షేమ సహాయకుడు బ్యాంకు నుంచి నగదును తీసుకువచ్చాడు దానిని ఎస్ఐ కాలనీకి చెందిన వాలంటీరు అందించారు.. ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేయగా అందులో ఒక ఆవిడకు 500 నోట్లు నకలీలుగా తేలింది దీనిపై అధికారులు స్పందించారు. అలాగే అప్పటి వరకు పంచిన నగదును వారు లబ్ధిదారుల వద్ద పరిశీలించగా అందులో 39 నోట్లు నకిలీవిగా తేలాయి.
అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తొలుత వాలంటీర్ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు తర్వాత పోలీసులు గట్టిగా అడగటంతో తప్పు చేసింది తానేనని ఒప్పుకున్నారు… దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. అతన్ని విధుల నుంచి తప్పించారు అయితే నాకు నేను నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి అన్ని నోట్లనో ఎలా సంపాదించారు అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది అయితే ఈ విషయం తెలిసిన వారంతా ప్రజలకు సేవ చేయాల్సిన వాలంటీర్లు ఇలా చేస్తే ఏమనాలో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు.. అలాగే ఇప్పటికే వాలంటీర్లు చేసిన కొన్ని పనులతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో కొందరు ఇబ్బంది పడిన సందర్భాలు ఎదురవుతూనే వస్తున్నాయి మళ్ళీ ఇలాంటి సంఘటనలే ముందు కనిపిస్తున్నాయి..