Politics ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను ఈ కొత్త ఏడాది నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది.
ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ మొత్తం రూ. 2,750 ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వారోత్సవాలను నిర్వహించనుంది ప్రభుత్వం…
జనవరి 3వ తేదీన రాజమండ్రిలో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక పాత, కొత్త పెన్షన్ లబ్ధిదారులు కలుపుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికిపైగా పెన్షన్ అందనుంది.. ఇప్పుడున్న లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో దేశంలోనే అత్యధికంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రెండు వారాల క్రితం ఏపీ క్యాబినెట్ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అలాగే వచ్చే ఏడాది నుంచి ఈ నిర్ణయం అమలు కానున్నట్టు తెలిపింది.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ పెన్షన్‌పై, వర్చువల్ క్లాసులపై సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలను తీసుకుంది.. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు నిర్వహించాలని తీర్మానించింది..