పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే.
ఈ వార్తలపై హీరో ప్రభాస్ మరో సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 వేదిక క్లారిటీచ్చారు. ప్రభాస్ తో వచ్చిన ఈ తాజా ఎపిసోడ్ ఒకటి నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ ఎపిసోడ్ నెట్టింట రికార్డు స్థాయిలో స్పందనతో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ ఎపిసోడ్‌లో ఆదిపురుష్ కోస్టార్ కృతిసనన్‌తో డేటింగ్ లైఫ్ గురించి అడిగాడు బాలయ్య.
ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్‌షిప్ ఏమీ లేదని కృతిసనన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని చెప్పాడు ప్రభాస్. దీంతో ప్రభాస్-కృతిసనన్ మధ్య ఉన్న అనుబంధంపై వస్తున్న వార్తలకు చెక్ పడ్డది.