Politics కందుకూరు సభలో జరిగిన సంఘటనపై మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు..
నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి 50 వేలు చొప్పున మంజూరు చేశారు అలాగే చనిపోయిన వారికి రెండు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు..
అలాగే ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చని పోయిన మృతల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలుపుతూ రెండు లక్షల పరిహారంగా ప్రకటించారు అంతేకాకుండా గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారాన్ని అందించనున్నారు.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచి తన ఆదేశాలను జారీ చేస్తూ వీరందరి కుటుంబాలకు అండగా నిలుస్తానని తెలిపారు.. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ సంతాపాన్ని తెలిపారు.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.. ఈ ఘటనలో ఇప్పటికే గాయపడిన వారందరికీ వైసిపి తెదేపా నాయకులందరూ సంతాపాన్ని తెలిపారు అలాగే క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు