ముషీరాబాద్ డివిజన్ లోని పార్సిగుట్ట బ్రహ్మంగారి దేవాలయ వెనుక వీధి, బాపూజీ నగర్, శివాలయం చౌరస్తా ల వద్ద 90 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మా పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజుల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు .
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు డ్రైనేజీ పైప్లైన్లు సైతం ఏర్పాటు చేసి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, తెరాస రాష్ట్ర నాయకులు యువ ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, తెరాస నాయకులు సోమసుందరం, ఎయిర్టెల్ రాజు, శివ ముదిరాజ్, శ్రీధర్ చారి, దీన్ దయాల్ రెడ్డి, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, పరశురాం, గోవింద్, మీసాల ప్రసాద్, గణేష్, రుద్ర ప్రవీణ్, ఆనంద్, శోభ, సదా, ముదిరాజ్, సంతోష్, శ్రీధర్ రెడ్డి, గోరక్ నాథ్, మహిపాల్, శ్రీకాంత్, సదా, బల్వంత్ అధికారులు ఏఈ మురళి, ఆర్ ఐ దాస్ నాయక్ మరియు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.