టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు గురువారం చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
సినీ పరిశ్రమలో తను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని వెల్లడించాడు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇలా సినీ కార్మికులకు గృహా సదుపాయం ఇండియాలో ఎక్కడా లేదని, ప్రభాకర్ దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని కొనియాడాడు.