Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అలాగే ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రకు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది..
జనవరి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాకకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కలెక్టర్ మాధవి లత అన్నారు..
ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాధవి లత పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారు తెలిపారు.. ముఖ్య మంత్రి జగన్ జనవరి 3వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్‌షో ద్వారా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు వస్తారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్ భరోసా పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశం ఇస్తారు. సందర్భంగా దీనికి సంబంధించిన నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.. అలాగే వచ్చే ఎన్నికల నేపథ్యంలో పలు విషయాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది జగన్ రాజమండ్రిలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఇప్పటికే ఆర్ ఎం బి అధికారులను కలెక్టర్ ఆదేశించినట్టు సమాచారం..