Politics ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే వస్తుంది అలాగే భారత్ లో కూడా ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు..
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.. మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి సిద్ధమయ్యారు అంతేకాకుండా కార్యక్రమాలు సైతం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లపై ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు..
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలో పలు రూల్స్ అమలులో ఉంటాయని.. వాటికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు అలాగే హైదరాబాద్ లో పంతాలలో రోడ్లు ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని చెప్పారు..
ఇందులో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మూసి వేయబడతాయి. అయితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ప్రయాణీకులు మాత్రం టికెట్లు చూపి వెళ్లొచ్చునని పోలీసులు తెలిపారు.
అలాగే ఆ సమయంలో ప్రయాణించాలి అనుకునే వారు సైతం సరైన ఆధారాలు పట్టుకుని ఉండాలని తెలిపారు అంతేకాకుండా.. నగరంలోని శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షైక్పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్- జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లలన్నీ కూడా ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు బంద్ అవుతాయి.