Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆమిత్ షా తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా తో ఆయన పలు కీలక విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వరకు ఆగిపోయానని వాటిని త్వరగా వచ్చేటట్టు చేయాలని అమిత్ షాను విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది..
అమిత్ షా తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారని తెలుస్తోంది.. ముందు ముందు కోవిడ్ వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎందుకు వైద్య రంగాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలిపినట్టు తెలుస్తోంది.. అలాగే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే 8000 గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు నెరవేర్చలేదని అలాగే వీరు రాష్ట్రాల మధ్య కీలక విషయాలు ఇప్పటికి పరిష్కారం కాలేదని వివరించినట్టు సమాచారం.. అలాగే జాతీయ ఆహార భద్రత విషయంలో రాష్ట్రానికి పలు విషయాల్లో ఇబ్బంది కలుగుతుందని వీటన్నింటిని పరిష్కరించాలని కోరినట్టు తెలుస్తోంది..
అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని తెలిపినట్టు తెలుస్తోంది అలాగే తెలంగాణ డిస్కంలో నుంచి రావాల్సిన కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని కూడా అమిత్ షాను జగన్ కోరినట్టు సమాచారం…