Politics దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రైలు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం..
దేశంలో వందే భారత్ రైలు ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మొదలు పెడతారు అనే విషయం చర్చనీయాంశం అయింది అయితే తాజాగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు త్వరలోనే తీసుకురానున్నట్టు తెలుస్తోంది.. ఈ రైలును మొదటిగా ఈ రెండు ప్రాంతాల మధ్య నడిపిస్తారని ఆ తర్వాత విశాఖపట్నం వరకు పొడిగిస్తారని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు..
అయితే వందే భారత్ రైలు ప్రయాణానికి తగినట్టు ట్రాక్ అప్ గ్రేడేషన్ పనులు పూర్తయి వచ్చే ఏడాది మొదటికే ఈ ట్రైన్ ఆ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఇప్పటివరకు వార్తలు వినిపించాయి అయితే ఈ ట్రాక్ అబ్రిడేషన్ పనులు జాప్యం జరగనుందని దీనివలన ఈ రైలు రావటానికి మరొక ఆరు నెలలు పట్టణం ఉన్నట్టు సమాచారం..
అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ వయా కాజీపేట్ సెక్షన్‌లో గరిష్ట వేగం గంటకు 130 కి.మీ., ఇప్పుడున్న ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 110 కి.మీ. పరిగెత్తే విధంగా ట్రాక్ అప్గ్రేడేషన్ పనులు ప్రారంభం కానున్నట్టు సమాచారం.. అలాగే మొదటి రైలు సికింద్రాబాద్-విజయవాడ రూట్‌లో.. రెండో రైలును సికింద్రాబాద్-తిరుపతి వయా విజయవాడ మధ్య నడపనున్నట్లు సమాచారం..