Home / POLITICS / Politics : ఎమ్మెల్యే అధికారం భవనంలో విద్యార్థి మృతి..

Politics : ఎమ్మెల్యే అధికారం భవనంలో విద్యార్థి మృతి..

Politics మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ సంఘటన కలకలం సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికార భవనంలో కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చినియాంసంగా మారింది.. ఈ విషయంపై పోలీసులు తమ విచారణ చేపట్టారు..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌కు చెందిన అధికార భవనంలో ఓ కళాశాల విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన శ్యామల హిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.. కాగా ఈ విద్యార్థి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.. అలాగే సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ అధికార భవనంలో తీరత్ సింగ్ అనే విద్యార్థి గత నాలుగేళ్లుగా చదువుకుంటున్నట్టు సమాచారం అలాగే అప్పటినుంచి అక్కడే ఉంటున్నట్టు తెలుస్తోంది గత కొన్నాళ్లుగా ఈ వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అలాగే క్యాన్సర్ తో బాధపడ్డాడని తెలుస్తోంది.. ఈ కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం ఎమ్మెల్యే అధికార భవనం కావడం ప్రస్తుతం మరింత చర్చిని అంశం గా మారింది అలాగే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.. అలాగే సూసైడ్‌ నోట్‌ను చేతిరాత నిపుణుల వద్దకు పంపించి అది అతడిదేనా అనే కోణంలో విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ విషయాన్ని కచ్చితంగా విచారిస్తామని… అలాగే అసలు విషయం ఏంటి అనేది బయటికి వచ్చేంతవరకు విచారణ జరిపిస్తామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు పోలీసులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat