Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు..
ప్రధాని మోదీ తల్లి హేరాబన్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు అయితే మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఆమె పుట్టిన రోజు తో పాటు పలు ప్రత్యేక సందర్భాల్లో ఆమెను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఆమె మోదీ సోదరుడి ఇంటిలో ఉంటున్నట్టు సమాచారం అయితే తాజాగా ఆమె ఆరోగ్యం క్షనించిందని దీంతో హుటాహుటి గా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది.. ఆమెకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది అలాగే ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.. అయితే ఈమె ఆరోగ్య పరిస్థితిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
అయితే ఈ విషయంపై మోడీ హుటాహుటిగా అహ్మదాబాద్ రానున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ విషయం తెలిసిన అసర్వా ఎమ్మెల్యే దుర్శాబెన్ వాఘేలా యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకున్నారు.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైలాస్‌నాథన్‌లు కూడా కొద్ది సేపటి కిందటే ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి పై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం.. కాగా హీరో బన్ ఈ ఏడాది జూన్ 18న తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె కాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ భావద్వేగంతో కూడిన ఒక పోస్ట్ ని కూడా ఉంచారు..