Politics చైనా తన చుట్టూ ఉన్న దేశాలపై చేస్తున్న ఆక్రమణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చుట్టూ ఉన్న చిన్న దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని పెద్ద దేశాలను ఇబ్బంది పెడుతున్న సంగతి ప్రపంచ దేశాల దృష్టిలో చైనాపై ఒక ఆలోచనను ఇచ్చేసాయి.. ఇప్పటికే పలు దేశాలు ఈ విషయంపై తమ జాగ్రత్తలు తాము ఉండగా చిన్న దేశాలు మాత్రం భయపడుతున్నాయి అయితే తాజాగా ఈ విషయంపై తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ స్పందించారు.. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకొచ్చాయి
చైనా నుంచి ఎప్పటికైనా తమకు ఇబ్బంది తప్పదని అనుకుంటున్న దేశాల్లో తైవాన్ కూడా ఒకటి.. తాజాగా రెండు రోజుల కిందట.. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాష్టింగ్టన్, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది ఈ విషయాన్ని మరొకసారి స్వయంగా వెల్లడించారు అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్..
ఈ సందర్భంగా మాట్లాడిన ఈమె.. “తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి… సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుంది..” అన్నారు సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు.