Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు..
మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మరాఠీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంతేకాకుండా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు… ఈ మేరకు ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సంగతి తెలిసింది అయినాప్పటికీ మాటలు వినలేదు అంతేకాకుండా ఈ తీర్మానంలో బెల్గాం, కార్వార్, బీదర్, నిపాని, భాల్కీలోని ప్రతి అంగుళం సహా 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల్లో ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందని తెలుపుతుంది… అయితే ఈ తీర్మానాన్ని కర్ణాటక ప్రభుత్వం ఖండించింది.. కర్ణాటకలో ఉన్న ప్రతి ప్రదేశం కన్నడ ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని అయితే దీనిని వారి నుంచి దూరం చేసే అధికారం ఎవరికి ఉండదని నేల నీరు ఏ ఒక గ్రామాన్ని కూడా ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదని ఈ విషయం కోసం ఎంతకైనా పోరాడుతామంటూ తెలిపింది కర్ణాటక ప్రభుత్వం