Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ను దర్శించారు.. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకుని అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు.. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు..
తెలంగాణ శీతాకాల విడుదకు వచ్చిన ఈమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.. అలాగే అన్నడు లేనివిధంగా ఈమె రావటంతో తెలంగాణ రాజకీయాల్లో పలు ఆసక్తికర కార్యక్రమాలు కూడా చోటు చేసుకున్న సంగతి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.. ముందుగా శీశైలంలోని సాక్షి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గతసారి తెలంగాణకు వచ్చినప్పుడు కూడా పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు రాష్ట్రపతి.
మల్లికార్జున స్వామివారి ఆలయ రాజగోపురం వద్ద గవర్నర్ తమిళ సై రాష్ట్రపతి ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో రు. 43 కోట్లతో ప్రసాద్ స్కీం కింద సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ప్రారంభించారు. శ్రీశైలం పర్యటన అనంతరం శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు.