ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది.
దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా మరో ఏడాదికి ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది.