తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందుగల గోశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు రాధిక దంపతులు ఈరోజు పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది.
ఈ గోశాలకు ఆ దంపతులు ప్రతి సంవత్సరం వారికి తోచిన మేరకు గ్రాసం ను వితరణ చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అర్చకులు సౌమిత్రి శ్రీ రామాచార్యులు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్కినేని రఘు, మాజీ జెడ్పిటిసి మేకల కృష్ణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొరకోపు ప్రసాద్, యువజన అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్ట ఆర్లప్ప, నీలాద్రి దేవస్థానం డైరెక్టర్ బానోతు బాలు,, సోషల్ మీడియా అధ్యక్షులు సిహెచ్ కిరణ్ కుమార్, ఎస్టీ సెల్ నాయకులు అజ్మీర జమలయ్య, ప్రముఖ న్యాయవాది పప్పుల రత్నాకర్, మండల నాయకులు బొగ్గుల రామిరెడ్డి, నాగిరెడ్డి, పిచ్చిరెడ్డి, గార్లు తదితరులు పాల్గొన్నారు.