తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్లను టీఆర్ఎస్ ఎంపీలు కోరనున్నారు.
రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్లను కలిసి ఎంపీలు వినతిపత్రం అందించనున్నారు. కేసీఆర్ నుంచి వచ్చిన లేఖతో ఎంపీ కేకే నివాసం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు.