Politics భారత్ మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు నెలకొంటూనే ఉంటూనే ఉన్నాయి అలాగే చైనా ప్రతినిత్యం భారత్ పై ఏదో ఒక రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ తవానికి సెక్టార్లో చైనా భారత్ మధ్య సంఘర్షణ అనంతరం ఈ దేశాల మధ్య వివాదాలు మరింత మొదలైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మరచి భారత్ చైనాకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది…
చైనాలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంది ఎక్కడ చూసినా కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ జీరో పాలసీ కరోనాను ఎత్తేయడంతో జనాలు విచ్చలవిడిగా రోడ్డుమీద తిరగటంతో కరోనా మరింత పెరిగింది అలాగే కొన్ని అధ్యయనాలు ప్రకారం వచ్చాయడాది పది లక్షల వరకు చైనాలో జనాలు కరోనాతో మరణించనున్నట్టు కూడా తెలుస్తుంది ఇంత విపత్కర పరిస్థితుల్లో మిగిలిన ఏ దేశాలు చైనాకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు కానీ భారత్ మాత్రం చైనాకు సహాయంగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే పలుమార్లు చైనాకు సాయం చేసిన భారత్ మరొకసారి తన పెద్ద మనసును చాటుకుంది..
కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో పోరాడుతున్న చైనాకు జ్వరం, ఇతర కొవిడ్ రుగ్మతలకు సంబంధించిన మందుల ఎగుమతులను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ‘భారత ఔషధ ఎగుమతి కమిటీ’ చీఫ్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్న ఇండియా.. అమెరికా, యూకే సహా అనేక దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్లు, టెస్టు కిట్లు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కరోనాకు సంబంధించి అన్ని రకాల సహాయం చైనాకు భారత్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది.