Politics సమాజం ఎంతగా ముందుకు వెళుతున్న బాల్యవివాహాలు మాత్రం ఆగటం లేదు ఇప్పటికి ఎన్నోచోట్ల 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మైనర్ల వివాహానికి అడ్డుకట్ట వేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.. ఇక మీదట తెలంగాణలో ఎక్కడ వివాహం జరగాలి అన్న వధూవరుల ఆధార్ కార్డులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. నేపథ్యంలో మైనర్ల వివాహాలు అడ్డుకునే అవకాశం ఉంటుంది
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది మైనర్లకు వివాహాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేసింది కాంట్రాక్ట్ పద్ధతిలో మైనర్లను పెళ్లి చేసుకుని తమ దేశానికి తీసుకు వెళుతున్న ఘటనలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి అయితే వీటన్నిటిని నివారించడానికి ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం…
ఇకమీదట ఎవరు పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకున్న వధూవరుల ఆధార్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని వయస్సు ధ్రువీకరణ పత్రం తెలంగాణ బోటుకు చెల్లించాలని తెలిపింది అలాగే దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కూడా సూచించింది.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ముస్లింల షాదీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, ఆన్‌లైన్‌లో మ్యారేజ్ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునేందుకు తప్పనిసరిగా హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నాజిరుల్ ఖజాత్ ఆఫీస్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.