Politics మంత్రి రోజా తాజాగా నగరి నియోజకవర్గ పరిధిలోని మేరా సాహెబ్ పలెంను దత్తత తీసుకున్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న రోజ తాజాగా దీన్ని దత్తత తీసుకోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు..
మంత్రి రోజా తాజాగా మేరా సాహెబ్ పాలెంను దత్తత తీసుకున్నారు ఇక్కడ కనీస వసతులు లేవని గుర్తించిన మంత్రి తన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు విద్యుత్తు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా మాట్లాడిన రోజు ఇందుకు గల కారణం ఏంటో చెప్పుకొచ్చారు..
దత్తత తీసుకోవడానికి గల అసలు కారణం తాను శ్రీమంతుడు సినిమా చూసి స్ఫూర్తి పొందాలని అన్నారు అలాగే కొన్ని నెలల్లో క్రితం ఇక్కడి నుంచి తనకు ఒక ఏడవ తరగతి చదువుతున్న అమ్మాయి లేఖ రాసిందని.. బహుశా ఆమెకు ఎవరైనా ఎమ్మెల్యే కు లెటర్ రాయమని చెప్పి ఉంటారని అందుకే ఆమె అలా చేసిందని అయితే తన ధైర్యం చూసి చాలా ఆశ్చర్యం వేసిందని అన్నారు అలాగే ఆ లెటర్ తీసుకొని నేరుగా ఊరికి వెళితే అక్కడ మౌలిక సదుపాయాలు లేవని రోడ్లు డ్రైనేజీ లేకుండా రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోయిందని అన్నారు.. అయితే ఆ లెటర్ పై డేటు వేసి మరి ఆ అమ్మాయికి ఇచ్చి కచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేస్తానని మాట ఇచ్చానని తెలిపారు..