Politics ఆంధ్రాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ సంబరాలు మొదలైపోతాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ మరింత వైభవంగా జరుగుతుంది అలాగే ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలకు ప్రసిద్ధి అయితే తాజాగా ఈ విషయంపై ఆంక్షలు విధించారు కలెక్టర్.. అలాగే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు..
సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలవుతాయి ఇంటి ముందు ముగ్గులు హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు కొత్త అల్లుళ్లు పిండి వంటలు అన్నిటితో పాటు కోళ్ల పందాలు సైతం ముందు వరసలో వచ్చి ఉంటాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ కోళ్ల పందాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. సంక్రాంతికి వచ్చే ఈ కోళ్ల పందాల కోసం పందెం రాయుళ్లు ఎన్నాళ్ళ నుంచి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈ పందాలు కూడా లక్షల్లో జరుగుతూ ఉంటాయి.. ఎన్నాల నుంచో కేవలం వీటి కోసమే ఆశగా ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు..
అయితే తాజాగా వీటిపై ఆంక్షలు విధించారు గోదావరి అధికారులు ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో కోళ్ల పందాలపై నిషేధం విధించారు కలెక్టర్ ప్రశాంతి.. అలాగే ఈ పండక్కి పందాలు ఆపాలంటూ ఆవేశాలు జారీ చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు వీటిని కాదని ఎవరైనా కోళ్ల పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అలాగే ఈ పందాల సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కూడా తెలిపారు..