తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాయపర్తి చర్చిలో ప్రభుత్వం తరుఫున గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పండుగల సందర్భంగా ఆయ మతాలకు చెందిన పేదలకు దుస్తులు, విందులు ఆహార పదార్థాలు అందజేస్తూ అన్ని మతాలను భాగస్వాములు చేస్తున్నారని పేర్కొన్నారు.
మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని, వారికి దేవుడి మీద ప్రేమ కంటే రాజకీయంపైనే ఎక్కువ మక్కువ ఉంటుందని ..గతంలో మతకల్లోలాలతో ఉండే హైదరాబాద్ నగరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు.
మందిరాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.క్రిస్మస్ పండుగకు రాష్ట్రంలోని 2 లక్షల 85 వేల మందికి దుస్తులు ఏటా అందజేస్తున్నారని, వీటి విలువ రూ.30 కోట్లు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బి.గోపి, వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వకాడే, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.