Politics కరోనా మళ్లీ మొదలైంది ముఖ్యంగా పొరుగు దేశం చైనాలో ఇది మరింత కలవర పెడుతుంది అయితే తాజాగా చైనా పరిస్థితి పై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు..
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లోక్సభలో కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా కీలక ప్రకటనలు చేశారు.. చైనాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఈ విషయం ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిదని అన్నారు అలాగే ఇప్పటికే అక్కడ ప్రతిరోజు ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయని ఈ పరిస్థితి ముందు ముందు మరింత దారుణంగా ఉండబోతుందని తెలిపారు అలాగే వచ్చేయడాది కరోనాతో అక్కడ లక్షల మంది మరణించే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో తేలిందని అలాంటి పరిస్థితి మరి ఏ దేశం తెచ్చుకోకూడదని అన్నారు అందుకే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు ఉపయోగించాలని తెలిపారు..
అలాగే ఇప్పుడు వచ్చే కరోనా కొత్త వేరియంట్ అని దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు సైతం ఈ విషయంపై తమ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.. అలాగే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మళ్ళీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నప్పటికీ భారత్ లో ఈ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని అన్నారు అయితే ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం లేదని ముందు కూడా ఇలాగే జరిగిందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. అలాగే న్యూ ఇయర్ పండుగలా నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్ షాట్స్ అందించమని చెప్పుకొచ్చిన మంత్రి ఎంతైనా జాగ్రత్తతోనే దీనిని అదుపులో ఉంచగలమని అన్నారు..