Politics దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖ పడుతున్నట్టే అనిపిస్తున్న రోజురోజుకీ మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అలాగే ఇప్పటికే చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో.. తెలంగాణలో కనిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే.. దేశంలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏసుక్రీస్తు అంటే చెప్పుకొచ్చిన ఆయన మానవ మనుగడకు కారణం యేసు అంటూ వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన… భారత దేశాభివృద్ధికి క్రైస్తవమతమే కారణమన్నారు. ఏసుక్రీస్తు దయవల్లే కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్నారు. ఏసు క్రీస్తు దయ, కృప వల్లే కరోనా కట్టడి అయ్యిందన్నారు. మనం మంచి చేయడం వల్ల తగ్గిందని చాలామంది అనుకుంటున్నారని, కాని వాస్తవం అది కాదన్నారు.. క్రీస్తు సందేశాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయాలని, కుల, మతాలంటూ ఏవీ లేవన్నారు. ఉన్నది ఒక్కటే మానవ జాతి అంటు భద్రాద్రి కొత్తగూడెంలో శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలు జాగ్రత్తలుత తీసుకోవడం ద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన చేసిన పనులు వివాదస్పదమవుతూ వస్తున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి పలువురు తమ అభ్యంతరాన్ని ఈ విషయంపై వ్యక్తం చేస్తున్నారు..