Home / EDITORIAL / కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.

కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.

“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్‌ దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి సాధించారు..

కేసీఆర్‌ కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ అప్పుడప్పుడు ప్రత్యర్థులకు అంతుచిక్కవు. కేసీఆర్‌ ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రత్యర్థులు బిత్తరపోతారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అధికార బలం లేదు. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమందిని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వైపు లాక్కున్నారు. ఉద్యమం కిందపడిందన్న ప్రతిసారి రాజే సేనాధిప తిగా మారి తిరిగి ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి లేపారు కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీలతోనే ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో తెలంగాణ వాదాన్ని వినిపించారు. దేశంలోని ప్రతి పార్టీని కలిశారు. ప్రధాని, రాష్ట్రపతి ఎవరినీ వదలలేదు. ప్రతి సందర్భాన్ని తెలంగాణ ఏర్పాటుకు ఉపయోగించారు. తెలంగాణ ఉద్యమానికి దేశవ్యాప్త చర్చను తీసుకువచ్చారు. జాతీయ మీడియా సైతం తెలంగాణ వైపు చూసేలా చేశారు కేసీఆర్‌. తద్వారా తెలంగాణ ఏర్పాటు అనివార్యమనే పరిస్థితులు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఎన్నికలలో విజయం సాధించి తాను సాధించిన తెలంగాణకు తానే తొలి సీఎం అయ్యారు. ఒక్కరూపాయి ఇవ్వనన్నచోట రెండులక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టి భేష్‌ అనిపించుకున్నారు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి రెండోసారి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు.

ఇదంతా ఆషామాషీగా దక్కిన విజయం కాదు.. గాలివాటం అంతకన్నా కాదు. కేసీఆర్‌ను ఒంటరిని చేశారు. హేళన చేశారు. అవమానించారు. అడ్రస్‌ లేకు ండా పోతావన్నారు. వీటన్నింటిని ఎదిరించి ఆ బక్కపలుచని కేసీఆరే తెలంగాణ సాధించారు. తెలంగాణను దేశానికే రోల్‌ మాడల్‌గా నిలిపారు. ఆయన అన్నట్టు తెలంగాణ స్వరాష్ట్రమై విరాజిల్లుతున్నది. విజయపు తొవ్వన పయనిస్తున్నది. ఇదంతా చెప్పడంలో ముఖ్యఉద్దేశ్యం ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) పార్టీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పార్టీకి వచ్చిన స్పందన అద్భుతం. అయితే ఇవేవి పట్టని విద్వేషపు తెగులు మీడియా దాన్ని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నది. సొంత కవిత్వాల కృష్ణయ్య విషపు రాతలు మొదలు పెట్టాడు. అంతే కాకుండా దేశంలో విషబీజాలు నాటుతూ మత కల్లోలమే దేశ అభివృద్ధిగా భావించే బీజేపీ విజ్ఞత లేకుండా అదే కుసంస్కారపు విమర్శలు చేస్తున్నది. వాస్తవానికి కేసీఆర్‌కు విమర్శలు కొత్త కాదు. విమర్శలను జయించిన వీరుడు, వెక్కిరింతలను ధిక్కరించిన ధీరుడు కేసీఆర్‌.

దేశం ఏం కోరుకొంటున్నది. దేశం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందన్న విజన్‌ ఉన్న నేత కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమ సమయంలో తానెత్తుకున్న నినాదం ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’.. తాను అధికారంలోకి వచ్చాక దాన్ని నిజం చేశారు. నేడు భారత దేశ రాజకీయాల్లో తాను ఎంట్రీ ఇచ్చే ముందు ఎత్తుకున్న నినాదం ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’. అత్యధికంగా రైతులున్న ఈ దేశంలో అందుకు అనుగుణంగా పాల న సాగటం లేదు. రాజకీయ ఎజెండాలు తప్ప ప్రజల అభివృద్ధి తెలియని బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నా రు. 75 వేల టీఎంసీల నీరు వృథాగా పోతున్నా వాటి ని ఎలా వినియోగించాలో అవగాహన లేని పాలకులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు ఉందో ప్రజలు ఆలోచించాలి. సంపద, సంస్కృతి, సర్వమత సమ్మేళనాలకు నెలవైన భారత దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదెవరో, ప్రజల్లో విద్వేషాలు నింపుతున్నదెవరో ప్రజలు, యువకులు, మేధావులు గమనించాలి.

దేశం మారాలంటే ముందు రైతులు బాగుండాలంటూ రైతు నినాదాన్ని ఎత్తుకున్నారు కేసీఆర్‌. దేశానికి కావల్సింది తెలంగాణ మాడల్‌. సబ్బండ వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి. కేసీఆర్‌ మొండిఘటం.. ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా ఎత్తిన జెండాను దించని నైజం ఆయనది. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే స్ఫూర్తి తనది. ఆ స్ఫూర్తి రేపు దేశానికి తొవ్వ చూపనున్నది. దేశ రైతాంగాన్ని రాజును చేయనున్నది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఆకాశపు అంచున సగర్వంగా నిలబెట్టనున్నది. దేశ ప్రజల కలలను నిక్కచ్చిగా నిజం చేస్తారు కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ ఇక రేపటి భారత దేశ భవిష్యత్‌.‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. దటీజ్‌ కేసీఆర్‌.

– తెలంగాణ విజయ్‌ 94919 98702

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat