Home / MOVIES / ‘వాల్తేరు వీరయ్య’ నుండి రెండో సాంగ్ విడుదల

‘వాల్తేరు వీరయ్య’ నుండి రెండో సాంగ్ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం   ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది.

ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసింది.‘శ్రీదేవీ చిరంజీవి’ అంటూ సాగే ఈ మెలోడీయస్‌ బీట్ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వర పరిచిన ఈ పాటను జస్‌ప్రీట్‌ జాస్జ్‌, సమీరా భరద్వాజ్‌ ఆలపించారు.

మంచులో విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘ఖైదీ నెం.150’ తర్వాత చిరు తన సిగ్నేచర్‌ స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే రిలీజైన ‘బాస్‌ పార్టీ’ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat