Politics తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు అయితే ఈ నేపథ్యంలో ఆయన తనను ఏ విచారణ కొరకు పిలిచిందో తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..
తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే ఈ విచారణకు ముందు తనకు గడువు కావాలంటూ పలుమార్లు ఇప్పటికే ఈడి ను విజ్ఞప్తి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఎన్నోసార్లు అతనికి గడువు పొడిగించిన ఈ డి తాజాగా విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పేసింది ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.. అయితే విచారణకు ఇప్పుడే రాహుకాలం ముగిసింది విచారణకు వెళుతున్నాను అంటూ కామెంట్ చేసినా రోహిత్ రెడ్డి.. ఆ తర్వత సీఎం కేసీఆర్ ను కలవడానికి ప్రగతి భవన్ కు వెళ్లారు.. ఇప్పటికే ఈయన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న సంగతి తెలిసిందే… అలాగే ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ విచారణకు హాజరైన ఈయన అంతకుముందు ప్రగతిభవన్లో కేసీఆర్ను భేటీ అయ్యారు.. ఏటి అనంతరం హైదరాబాదులో ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు అయితే ఈ విచారణలో ఆయనను ఏమేం ప్రశ్నలు అడిగారు ఇంకా ముందు ముందు ఏం జరగనుంది అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..