Politics అమ్మతనం నిజంగా ఒక వరమనే చెప్పాలి ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు నాగపూర్ కు చెందిన మహిళ ఎమ్మెల్యే సరోజ్ అహిరే.. ఆమె తన రెండున్న నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది.
నాగపూర్ కు చెందిన మహిళ ఎమ్మెల్యే సరోజహిరే రెండున్నర నెలల క్రితం ఒక పాపకు జన్మనిచ్చారు అయితే తాజాగా శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె తన బిడ్డను వదిలి రాలేక ఆమెను తీసుకొని అసెంబ్లీకి వచ్చారు తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది… బాలింత అయినా తన బాధ్యత విసర్మించకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంతో ఆ మహిళ ఎమ్మెల్యేపై ప్రశంసలు వర్షం జల్లు కురిపిస్తున్నారు.
ఎమ్మెల్యే సరోజ్ అహిరే కు సెప్టెంబర్ 30న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే.. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆమె తన రెండున్న నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది. అదే గత రెండున్నర ఏళ్లుగా కరోనా కారణంతో అసెంబ్లీ సమావేశాలు జరగలేదని తాను తల్లి అయినంత మాత్రాన ఓటర్లకు ఏం సమాధానం చెప్పాలని అందుకే కష్టమైన అసెంబ్లీ సమావేశాలకు వచ్చానని తెలిపారు.. ఇటు అమ్మతనం అటు సమావేశాలు రెండు ముఖ్యమైన అని అందుకే దీన్ని వదులుకోలేకపోయాను అంటూ చెప్పుకొచ్చిన ఈమెపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.. అలాగే ఇంతకుముందు ఎందరో మహిళలు తమ బిడ్డలతో పాటు అసెంబ్లీలకు వచ్చారు వారంతా అప్పట్లో చర్చనీయాంశంగా మారారు..