తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అని అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇరవై నాలుగంటల కరెంటు లేదు.. రైతు బంధు లేదు.. రైతు బీమా లేదు.. ప్రాజెక్టులు లేవు.. కళ్యాణ లక్ష్మీ లేదు.. జిల్లాకో మెడికల్ కాలేజీలు లేవు ఆయన హెద్దేవా చేశారు.
దేశంలోని మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వాలి అని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు పేర్లు మార్చి మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ తమ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తుందని ఆయన హెద్దేవా చేశారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.