Politics ఆంధ్రప్రదేశ్ ను నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సోమవారం స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు జగన్..
రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితరాష్ట్రంగా మార్చాలని అన్నారు జగన్ ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడ మాదిగ ద్రవ్యాలు వినియోగించకుండా చూడాలని తెలిపారు ఇందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు.. అలాగే ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్ పెట్టి ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రచారం చేయాలన్నారు. అలాగే ఈ విషయంపై అందరికీ పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగు జరగకుండా చూడాలని ఇలా సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని అన్నారు.. అలాగే నిర్ణయం అనంతరం వీరంతా నష్టపోతారని అందుకని వీళ్ళకి ఏవైనా ఉపాధి కల్పించాలంటే చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి..
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ మహిళా పోలీస్ల పనితీరు ఇంకా మెరుగుపరచాలని దిశా చట్టం యాప్లను సమర్ధవంతంగా వినియోగించాలని అన్నారు.. అదే ప్రతి మంగళవారం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను సూచించిన జగన్ పోలీసు ఉన్నతాధికారులు అక్రమ మద్యం గంజాయి సాగు నివారణ పై కృషి చేయాలని తెలిపారు.. అలాగే రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ఇదంతా చేయాలని యూనివర్సిటీలు కాలేజీలు సైతం జీరో నార్కోటిక్స్ గా ఉండాలని అన్నారు.. రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితరాష్ట్రంగా మార్చాలని అన్నారు..