Politics భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ఇప్పటికే వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు కొన్ని దేశానికి ప్రధానులుగా మరి కొన్ని దేశాలకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకొన్ని దేశాల్లో అసెంబ్లీలో తమదైన ముద్ర వేస్తున్నారు భారత సంతతికి చెందిన లియా వరాద్కర్ ఐర్లాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రెండోసారి ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు..
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి లియా వరాత్కర్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు 2017లో తొలిసారి ప్రధానంగా ఎన్నికైన ఈయన ప్రస్తుతం మళ్ళీ ప్రధాని అయ్యారు.. రొటేషన్ పద్ధతిలో ఫిన్‌గేల్ పార్టీకి చెందిన వరాద్కర్‌కు మరోసారి అవకాశం దక్కింది..
2020లో ఫిన్‌గేల్, మార్టిన్ ఫియన్నాఫెయిల్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రొటేషన్ పద్ధతిలో వరాద్కర్‌కు మరో అవకాశం లభించింది. అలాగే మైఖెల్ మార్టిన్ స్థానంలో ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అలాగే కేవలం 43 ఏళ్ల వయసులోనే ఐర్లాండ్ కు ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా అప్పట్లో చరిత్ర సృష్టించారు లియో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించారు.. అలాగే 2015లో స్వలింగ వివాహాలను చట్టబధ్దం చేసిన క్రమంలో తాను గే అని బహిరంగంగానే ప్రకటించారు.. అలాగే రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో తమ పౌరుల కోసం అన్ని విధాల కష్టపడతామని వారికి చేయవలసిన కావలసిన అన్ని సహకారాలు అందిస్తామని తెలిపారు..