Politics మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి మన్ శుఖ్ మాండవియా లోక్సభలో చేసిన ప్రకటనపై ఈయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు..
కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి మనసుకు మాండవియా తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండుపడ్డరు… బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసిన కేటీఆర్ పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాలని గాయపరిచారని అన్నారు..
“మంత్రి మన్ సుఖ్ మాండవియా పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాలని గాయపరిచారు జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బిజెపి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.. కేటీఆర్
అలాగే.. “అబద్ధాలతో పార్లమెంట్‌ను కేంద్రమంత్రి తప్పుదోవ పట్టించారు. ఆయనపై లోక్‌భలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలి. తప్పుదోవ పట్టించినందుకు కేంద్రమంత్రి మాండవీయ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్‌ను ప్రముఖ లైఫ్-సైన్సెస్ హబ్‌కు తిరస్కరించడం దారుణం. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి…” – ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్..
లోక్సభలో కేంద్రమంత్రి దేశంలో మూడు డ్రగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించమని తాజాగా చెప్పారు… అలాగే ఒక్కో దానిపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.