Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ పార్టీ దేశస్థాయిలో విస్తరించిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలపై దృష్టి సారించింది అయితే తాజాగా టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీ ఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తాయి అంటూ వార్తలు వినిపించాయి అయితే తాజాగా మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో టిడిపి తో కలిసి వెళ్ళేది లేదు అంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే జనసేన బిజెపి కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయి అనే వార్తలు కూడా వినిపించగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.. అలాగే టీడీపీ జనసేన కూడా కలిసి పోటీ చేసేటట్టు అనిపించడం లేదు అయితే ఈ సమయంలోనే మరొక కొత్త విషయం వినిపిస్తుంది..
తాజాగా దేశస్థాయిలో విస్తరించిన టిఆర్ఎస్ పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న సంగతి తెలుస్తోంది.. ఇందుకోసం ఇప్పటికే టిడిపి కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వీరిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.. అలాగే టిడిపిని కేవలం ఆంధ్రకు మాత్రమే పరిమితం చేయకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం టిడిపి నాయకులు అందర్నీ కూడా తమ పార్టీలో కలుపుకోవాలని కెసిఆర్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది దీనివల్ల ఇటు అసెంబ్లీ అటు లోక్సభ 2 ఎన్నికల్లో లాభం చేకూరుతుందని అనుకుంటున్నాట్టు సమాచారం..