Politics తెలంగాణ కాంగ్రెస్లో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి తాజాగా కమిటీల కోర్పు వివాదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా పిసిసి కమిటీల కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అందరూ రెండుగా చీలిపోయారు.. అలాగే టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీ అంశం అయింది..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి ముఖ్యంగా కమిటీల కోర్టు విషయంలో ఈ వివాదం నెలకొంది దీనిపై తాజాగా బట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వీరంతా ప్రత్యక్షంగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు అయితే తాజాగా టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవికి రాజీనామా చేయడంతో వివాదం మరింత ముదిరింది…
అలాగే వీరందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యక్షంగానే మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వీరంతా తమ వల్ల పదవులు రాని వారందరికీ ఈ పదవులు ఇచ్చేయండి అంటూ తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.. అలాగే రాజీనామా లేఖను ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు పంపించారు నేతలు. వీరిలో నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రామారావు, చారగొండ, వెంకటేష్, ఎర్రశేఖర్, జంగయ్య యాదవ్, దొమ్మాటి సాంబయ్య, పటేల్ రమేష్ రెడ్డి, డా సత్యనారాయణ, ముధసూదన్ రెఎడ్డి, మల్లేష్, సుభాష్ రెడ్డి ఉన్నారు..