Politics తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే పెను దుమారాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే కమిటీల కోర్పు తెలంగాణ కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టించింది ఇందులో కొందరు సీనియర్ నేతలు తమకు పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో వీరంతా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కూర్పు తీవ్ర చర్చకు దారితీసింది.. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నేతలు బట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు.. వీరిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేతలు మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..
కమిటీల నియామకం అంశంపై చెలరేగుతున్న వివాదాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, తమతో సంప్రదించకుండా కమిటీలు ఎలా వేశారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తోన్నారు. వలసవాదులతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని, టీ కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడు సరిగ్గా లేరని ఆరోపించారు. పార్టీలు మారిన నాయకుడు చేతిలో పార్టీ బాధ్యతలు పెడితే పార్టీ నాశనం అవుతుందని రేవంత్‌పై సీనియర్లు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు… అయితే వీరంతా తీసుకున్న నిర్ణయానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంతా మా మద్దతును ప్రకటించారు.