Politics దేశంలో ఎక్కువ భాగం ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే రేషన్ పైన ఆధారపడి జీవిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ప్రభుత్వం తక్కువ ధరకు అందించే రేషన్కు ఎంతగానో ఎదురు చూస్తూ గడుపుతున్నారు అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా డిజిటల్ రేషన్ కార్డులు వచ్చేసాయి.. అయితే వీటి ద్వారా మీరు రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు.. ఈ రేషన్ కార్డును ఉపయోగించుకోవచ్చు అయితే ఈ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం..
ఈ రేషన్ కార్డును కేంద్ర ప్రభుత్వం 2015లోనే ప్రవేశపెట్టింది తొలి దశలో ఢిల్లీలో ప్రవేశపెట్టగా తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమలయింది… అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అనుసంధానం అయిన వారు ఎవరైనా కానీ ఈ రేషన్ కార్డు ద్వారా తీసుకోవచ్చు ఈ రెండు అనుసంధానమై ఉన్నవారు ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ప్రతి నెల చాలా తేలికగా రేషన్ను తెచ్చుకోవచ్చు.. ఇందుకోసం ప్రతి రాష్ట్రం తమ సొంత ప్రజా పంపిణీ వ్యవస్థను వెబ్సైట్లో ఉంచింది.. ఇందులో తమ సమాచారాన్ని ఇచ్చి ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు..
అలాగే ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారం nfsa.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రింట్ రేషన్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను ఫారమ్‌లో నింపండి.. ఆ తర్వాత కావాల్సిన అన్ని వివరాలను అందులో ఎంటర్ చేస్తే ఈ రేషన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. దీంతో మీ దగ్గర రేషన్ కార్డు ప్రింట్ లేకపోయినా ప్రతినెలా చాలా తేలికగా రేషన్ ను తీసుకోవచ్చు..