Politics బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. తాజాగా ఓ విభిన్న ఆహ్వాన పత్రికను రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
బాపట్ల జిల్లాకు చెందిన వైసిపి నేత పాలేటి రామారావు తాజాగా రాసిన ఓ ఆహ్వాన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులకు అందజేశారు.. అలాగే ప్రస్తుతం తనకు 63 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా 12 ఏళ్లు మాత్రమే తనకి బతకాలని ఉందని ఈ 12 ఏళ్లు తర్వాత ఆయన చనిపోతాను.. భగవంతుడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ప్రజలు వాటిని వినటానికి ఆచరించడానికి సిద్ధంగా లేరు అంటూ లేఖ రాసి అభిమానులకు పంచారు..
ఇందులో “అందరికీ నా మరణ దిన వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నాను.. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్ధం లేదని, మరణ దినోత్సవ వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాను.. నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను.. నేను మరణించే సమయం ఇంకా 12 ఏళ్ళు ఉంది. అందువల్ల ఈరోజు నుంచే 12వ మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. కావున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి.. “రాసిన లేక ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. బతికి ఉన్న ఇన్నాళ్లు ఎలాంటి అర్థం లేకుండా బతికానని చావునైనా ఘనంగా చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ తెలిపారు..అలాగే ఈయన టిడిపి తరఫున 1994, 99 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా పనిచేశారు.. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో తనదైన కీలకపాత్ర పోషించారు..