మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణసాయంగా లక్షా 10వేల రూపాయలను అందజేశారు. మిగితా ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలలో సీటు ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. పాఠశాలలో సీసీటీవి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా సీపీతో మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామన్నారు.చెడు వ్యసనాలకు గురైన కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బాలిక అనుమానాస్పద మృతి కేసులో.. పోస్ట్ మార్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగవత్ హెచ్చరించారు.
Tags aicc amith shah bjp chamakura mallareddy cmkcr congress it minister of telangana kalvakuntla tarakaramarao kcr minister of telangana narender modi rahul gandhi revanth reddy slider Sonia Gandhi telangana minister telanganacm telanganacmo telanganagovernament thanneeru harish rao trs trsgovernament