Politics కొందరి నేతలు ఎంత చెప్పినా వారి పనితీరును మెరుగుపరచుకోవడం లేదని ఇదే వారికి చివరి అవకాశం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొందరు నేతలు తమ పనితీరును మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.. అలాగే వీరందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు… అలాగే వీరందరికీ మూడు నెలలు సమయం వచ్చి నీలోగా తమ పనితీరును మార్చుకోవాలంటే లేదంటే తన నిర్ణయం వేరే రకంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు..
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు జగన్ ఈ సందర్భంగా పలువురు నేతలు ఎంత చెప్పినా తమ పనితీరును మెరుగుపరచుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు పార్టీ కోసం ప్రజల కోసం ఏమాత్రం తమ సమయాన్ని కేటాయించడం లేదని సమయం అంతా తమ వ్యక్తిగత విషయాల కోసం కేటాయించుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు అయితే ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అలాగే దీనిపై తదుపరి సమీక్ష వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని ఈలోగా పరిస్థితి చక్కబడితే సరే లేదంటే తన నిర్ణయం ఇంకో రకంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు.. అలాగే వచ్చే ఏడాది నుంచి పెన్షన్ పెంపు నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షన్ను అందించాలని చెప్పుకొచ్చారు.. ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ నేతలదేనంటూ తెలిపారు..