ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి విధితమే. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది.
సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,రావు రమేష్,అనసూయ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పుష్ప -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఈ క్రమంలో ఎంటర్ ట్రైన్మెంట్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బన్నీని వరించింది. వినోద రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తులకు జీక్యూ ఇండియా మ్యాగజైన్ ప్రతి ఏటా లీడింగ్ వుమెన్ అవార్డులను ప్రధానం చేస్తుంది.
ఈ ఏడాదికి గానూ ఈ అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. దీనిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ జీక్యూ మ్యాగజైన్ కవర్ పై నా ఫోటో రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నన్ను అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నా లిస్ట్ లోని ఓ టార్గెట్ ను చేరుకున్నాను అని ఆయన అన్నారు.