Politics ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ఇందులో ప్రియాంకా గాంధీ కుటుంబం కూడా పాల్గొన్నారు అయితే తాజాగా ప్రియాంక గాంధీ విజయవాడలో పర్యటించినున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా వస్తున్న సంగతి తెలిసిందే 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది అయితే రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్పై ఒక రకమైన వ్యతిరేక భావాన్ని పెంచుకున్నారు ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ ఏపీలో కొందరు కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఏమాత్రం కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు అయితే రాబోయే ఎన్నికల కోసం మాత్రం కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది..
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో డిపాజిట్ కోల్పోవడంతో అందులో ఉన్న ప్రముఖ నేతలు అందరూ వేరే పార్టీలకు మారిపోయిన సంగతి తెలిసిందే.. అలాగే కొందరు అధికార వైసీపీలోకి మారగా మరికొందరు మాత్రం తటస్థంగా ఉండిపోయారు అయితే 2019 ఎన్నికల్లో కొన్ని చోట్ల నూట కంటే తక్కువ ఓట్లను సంపాదించుకుంది కాంగ్రెస్. అయితే ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కాంగ్రెస్ రావడం దాదాపు అసాధ్యమే అంటూ డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై కాంగ్రెస్ తన ఫోకస్ను పెంచుకోనుంది తాజాగా జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో అధికార బాజాపాను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆశాభావం మళ్లీ మొదలైంది 2024 లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నాహమవుతుంది అయితే ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఆంధ్ర ప్రదేశ్ ను పర్యటించనున్నట్టు తెలుస్తోంది విజయవాడలో ఆమె పర్యటించి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం..