Politics తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్రదుమారాలు చెల రేగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన మోడీని కలవనున్నారని వార్తలు కూడా వినిపించాయి అయితే డిసెంబర్ 16వ తేదీన ఈయన మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈయన ఎంపీ హోదాలో ప్రధానిని కలవనున్నారా లేక భాదాపాలో చేరేందుకు వెళ్తున్నారా అనే విషయం ఎవరికీ స్పష్టం లేదు అయితే తాజాగా ఈయన రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు అనే విషయం తెలుస్తోంది… అయితే ప్రస్తుతానికి మాత్రం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులపై చర్చించేందుకే కోమటిరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సంద్భంగా పలు కీలక అంశాలపై ప్రధానితో భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
భువనగిరి నియోజకవర్గం లో ఇప్పటికే ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది వీటన్నిటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి మెట్రో ఎంఎంటీఎస్ సేవలను భువనగిరికి అందించాలని కోరుతూ మోడీకి విన్నపించడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.. అలాగే భువనగిరి అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని ఇందుకోసం తగిన సహాయం కేంద్రం చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది.. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పలుకేలక విషయాలను మోడీతో చర్చించడమే కాకుండా.. రాష్ట్ర రాజకీయాలపై కూడా మాట్లాడాను అన్నట్టు తెలుస్తోంది. .ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలపై వీరిద్దరూ చర్చించనున్నట్టు సమాచారం అందగా భాజపాలో చారటంపై ఇంకా స్పష్టత రాలేదు