పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది.
ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల బిజీతో షూటింగ్ ఆలస్యమయింది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ మొదలైన నేపథ్యంలో తనకు డేట్స్ కుదరకపోవడంతో ముద్దుగుమ్మ పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా పవన్ కాంబో చూసే భాగ్యం పవన్ అభిమానులకు లేనట్లు ఉంది.