తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది.
బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.