politics భాజాపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా.. తాజాగా బిజేపి ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవ్వడంతో ఈయన బిజెపిని వీడి జనసేనలో చేరుతారు అంటూ వార్తలు గుప్పు మన్నాయి… గుంటూరులోని కన్నా నివాసం ఈ భేటీకి వేదికైంది. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ, నాదెండ్ల.. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరగా.. నాదెండ్ల జనసేన పార్టీలో చేరారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నాకు భేదాభిప్రాయాలు ఉన్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ తీరుపై ఆ నాయకులు పై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈయన కాషాయపార్టీ ని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఆంధ్రాలో ఇంకా బీజేపీ జనసేన పార్టీలు కలిసే ఉన్నాయని.. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన ఈ పార్టీల మధ్య ఇటీవల గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకూ ఇరుపార్టీల నేతలు తెగతెంపులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అంతేకాకుండా.. అలాగే ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.