తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.
ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ హాసన్ మా సినిమా సెట్ లో ఉదయం ఐదుగంటలకే అడుగు పెడుతారు. ఆయన తొంబై ఏండ్ల వృద్ధుడి పాత్రను పోషిస్తున్నారు.
ఈ గెటప్ కోసం ఐదు గంటల ప్రోస్థటిక్స్ (మేకప్) వేసుకుంటున్నారు. దాన్ని తొలగించేందుకు మరో రెండు గంటలు పడుతుంది. ఉదయం పది గంటలకు కెమెరా ముందు సిద్ధమవుతున్నారు.
చెన్నైలో ఉండే వేడి ఉక్కపోతలో ఐదు గంటలు క్యారెక్టర్ కోసం సిద్ధమవ్వడం అంత సులువు కాదు. నటనకు ఇంతగా అంకితమయ్యే మరోకర్ని చూడలేదు .. ఆయన జీవితాన్ని వెండి తెరకు అంకితం చేశారు అని అన్నారు.