కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సముచిత గౌరవం కల్పిస్తున్నారని.. అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని అన్నారు.
క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు ఎటువంటి సహాయ సహకరాలకైనా ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు క్రీస్తు రాజు, శౌరి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్, నాయకుడు రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.